భాషాభివృద్ధికి చర్మ పదకోశం నిఘంటువు పునాది

ABN , First Publish Date - 2020-02-08T09:42:02+05:30 IST

భాషాభివృద్ధికి, నాగరికత వికాసానికి చర్మ పదకోశ నిఘంటువు పునాదిగా నిలుస్తోందని టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. తెలుగు అకాడమీ ముద్రించిన చర్మ పదకోశం-తోలు సంబంధ పదాల

భాషాభివృద్ధికి  చర్మ పదకోశం నిఘంటువు పునాది

పుస్తకావిష్కరణలో ఘంటా చక్రపాణి

హిమాయత్‌నగర్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): భాషాభివృద్ధికి, నాగరికత వికాసానికి చర్మ పదకోశ నిఘంటువు పునాదిగా నిలుస్తోందని టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. తెలుగు అకాడమీ ముద్రించిన చర్మ పదకోశం-తోలు సంబంధ పదాల నిఘంటువును శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. కాలక్రమంలో తోలు సంబంధిత పదాల వాడకం తగ్గిపోతోందని, ఈ పరిస్థితుల్లో రచయిత ఆర్‌ఎల్‌ఆర్‌ ప్రసాద్‌ చర్మ పదకోశ నిఘంటువుతో ఆ పదాలను నేటి తరానికి పరిచయం చేయడం అభినందనీయమన్నారు. మరుగున పడిపోతున్న పురాతన వాడుక పదాలను ఈ పుస్తకం ద్వారా రచయిత మరోసారి వెలుగులోకి తెచ్చారని అంబేడ్కర్‌ వర్సిటీ డీన్‌ ప్రొఫెసర్‌ సుధారాణి అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయితలు కాలువ మల్లయ్య, పసునూరి రవీందర్‌, ప్రొఫెసర్‌ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-02-08T09:42:02+05:30 IST