నిమ్స్‌లో డయాలసిస్ పేషెంట్ల ఆందోళన
ABN , First Publish Date - 2020-09-16T20:58:43+05:30 IST
నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్లు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్లు ఆందోళనకు దిగారు. కరోనా కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నామని, ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉండడంలేదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేక ఈ మధ్య కాలంలో 40 మంది చనిపోయారని కిడ్నీ బాధితులు తెలిపారు.
ఈ సందర్భంగా బాధితులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తమ సమస్యలపై అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు లేఖలు ఇచ్చామని.. ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆందోళన చేపట్టామని తెలిపారు. తమకు పెన్షన్ మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. కిడ్నీ బాధితులు ఏ ఉద్యోగం చేయలేరని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ప్రభుత్వం ఆదుకుంటే కొంత భారం తగ్గుతుందని వారు అన్నారు.