ఏకకాలంలో 700 మందికి ‘ధరణి’ శిక్షణ

ABN , First Publish Date - 2020-10-27T09:18:42+05:30 IST

ఏకకాలంలో 700 మందికి ‘ధరణి’ శిక్షణ

ఏకకాలంలో 700 మందికి ‘ధరణి’ శిక్షణ

అనురాగ్‌ యూనివర్సిటీలో నేడు నిర్వహణ


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 700 మంది తహసీల్దార్లు/డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని అనురాగ్‌ వర్సిటీలో మంగళవారం ఇవ్వనున్న శిక్షణకు వీరంతా హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. ధరణి ఆధారంగా రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్నదానిపై, తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-2020తో పాటు న్యాయపరమైన అంశాలపై ఉదయం సమయంలో థియరీ క్లాసు ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్‌పై ప్రాక్టికల్‌ శిక్షణనివ్వనున్నారు.

Updated Date - 2020-10-27T09:18:42+05:30 IST