క్రమశిక్షణతో పనిచేయండి

ABN , First Publish Date - 2020-12-12T05:14:23+05:30 IST

క్రమశిక్షణతో పనిచేయండి

క్రమశిక్షణతో పనిచేయండి

మహిళా పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశం


వరంగల్‌ అర్బన్‌ క్రైం, డిసెంబరు 11: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసు అధికారులతో శుక్రవారం రాష్ట్ర డీసీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్‌ పోలీస్‌ క మిషనరేట్‌ నుంచి ఇన్‌చార్జీ సీపీ ప్రమోద్‌కుమార్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, భరోసా కేంద్రం ఇన్‌చార్జి శ్రీలక్ష్మి, విశ్రాంత మహిళా ఎస్సై నసీమా సుల్తానా, పోలీ్‌సస్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీ్‌సస్టేషన్లలో మహిళా సిబ్బందికి కల్పించిన మౌలిక వసతులు, ఇబ్బందుల గురించి డీజీపీ ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీసు సిబ్బంది పురుషులతో సమానంగా పని చేస్తున్నారని, క్రమశిక్షణతో పనిచేసి పోలీసుశాఖకు మంచిపేరు తీసుకురావాలని డీజీపీ సూచించారు.

Updated Date - 2020-12-12T05:14:23+05:30 IST