ఆకలి తీర్చేందుకు పరిచయం అక్కర్లేదు: డీజీపీ
ABN , First Publish Date - 2020-04-28T10:24:16+05:30 IST
ఆకలి తీర్చేందుకు ఒకరితో ఒకరికి పరిచయం అవసరం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం

హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : ఆకలి తీర్చేందుకు ఒకరితో ఒకరికి పరిచయం అవసరం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. మనం మాత్రమే కాదు విపత్కర పరిస్థితుల్లో మనతోపాటు మరికొందరిని బతికించుకుందాం అన్నారు. ‘‘మనమంతా మనుషులం అని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నిరూపించుకుంటాం?మనం కాకపోతే ఆదుకునేందుకు ఎవరు వస్తారు? మనమందరం కలిసి కట్టుగా కరోనాని ఓడిద్దాం’’ అని పేర్కొన్నారు. ఓ వీడియోని కూడా డీజీపీ తన ట్వీట్‌కు జోడించారు.