సర్వీసు వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టండి: డీజీపీ

ABN , First Publish Date - 2020-09-16T09:54:19+05:30 IST

పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సర్వీసు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

సర్వీసు వివరాలను   ఆన్‌లైన్‌లో పెట్టండి: డీజీపీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సర్వీసు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, పరిపాలన విభాగం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖలో 80 వేల మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ(హెచ్‌ఆర్‌ఎంఎస్‌) ద్వారా సిబ్బంది సర్వీసు వివరాల అప్‌లోడ్‌ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. నియామకం మొదలు.. శిక్షణ, సర్వీస్‌ రికార్డు, హాజరు, సెలవులు, రివార్డులు, పరిపాలన, వర్క్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫిర్యాదులు, విశ్లేషణలు.. ఇలా ప్రతి అంశాన్ని హెచ్‌ఆర్‌ఎంఎ్‌సలో పొందుపర్చాలని సూచించారు.’

Updated Date - 2020-09-16T09:54:19+05:30 IST