ఆరేళ్లలో రూ.67,150 కోట్లు

ABN , First Publish Date - 2020-11-21T09:37:14+05:30 IST

గత ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.67,150 కోట్లను ఖర్చుచేసినట్లు ప్రగతినివేదిక పేర్కొంది. అభివృద్ధి కార్యక్రమాల వల్ల హైదరాబాద్‌

ఆరేళ్లలో రూ.67,150 కోట్లు

హైదరాబాద్‌ అభివృద్ధికి వ్యయమిది..

ప్రగతినివేదికను విడుదలచేసిన కేటీఆర్‌

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూ. 9,700 కోట్లు

మెట్రో రైలు విస్తరణకు రూ.17,290 కోట్లు

ఔటర్‌ రింగ్‌ ప్రాజెక్టుకు రూ.3,310 కోట్లు

విద్యుత్తు సరఫరాకు రూ.2,374 కోట్లు

స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం రూ.1,716 కోట్లు అని వెల్లడి


హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గత ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.67,150 కోట్లను ఖర్చుచేసినట్లు ప్రగతినివేదిక పేర్కొంది. అభివృద్ధి కార్యక్రమాల వల్ల హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా గొప్పపేరు సాధించిందని వివరించింది.  ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆరేళ్లలో హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిపై రూపొందించిన ప్రగతినివేదికను తెలంగాణభవన్‌లో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ నివేదికలను జీహెచ్‌ఎంసీ డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులకు అందజేశారు. హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలు, అందుకు అయిన వ్యయ వివరాలు ప్రగతినివేదికలో ఉన్నాయని, ఎన్నికల ప్రచారంలో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.


ప్రగతినివేదికలో ప్రధానాంశాలివే!

  • హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణకు రూ.17,290 కోట్లు. 72 కిలోమీటర్లమేర అభివృద్ధి.
  • రహదారుల అభివృద్ధికి రూ.14,739 కోట్ల వ్యయం. అందులో ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.8,410 కోట్లు ఖర్చు. 9 ప్లైఓవర్లు, 4 అండర్‌పా్‌సలు, 3 ఆర్వోబీలపాటు ఓ కేబుల్‌ బ్రిడ్జిని అభివృద్ధి చేశారు.
  • మోడల్‌ రోడ్‌ కారిడార్‌, లింక్‌ రోడ్ల కోసం రూ.314 కోట్లు ఖర్చుచేశారు. 137 లింక్‌రోడ్లను అభివృద్ధి చేశారు. సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమానికి రూ.1,839 కోట్లు ఖర్చు చేశారు. 
  • లాక్‌డౌన్‌లో సమయంలో రూ.2వేల కోట్ల విలువైన రహదారుల నిర్వహణ, అభివృద్ధి పనులను పూర్తిచేశారు. 15 ప్లైఓవర్లు, 29 ముఖ్యమైన లింక్‌ రోడ్ల నిర్మాణంతో పాటు 300 కిలోమీటర్లమేర రోడ్లకు మరమ్మతులు చేశారు.
  • ఔటర్‌ రింగ్‌ ప్రాజెక్టుకు రూ.3,310 కోట్లను ఖర్చుచేశారు. 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ఓఆర్‌ఆర్‌ అభివృద్ధి పనుల కోసం వినియోగించారు.
  • తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ కోసం రూ.14,175 కోట్లను వెచ్చించారు. 4,721 కిలోమీటర్ల పొడవులో తాగునీటి పైప్‌లైన్లను ఏర్పాటుచేశారు. 230 స్టోరేజీ రిజర్వాయర్‌లను నిర్మించారు.
  • నిరాంతరాయంగా విద్యుత్తు సరఫరాకు రూ.2,374 కోట్లను ఖర్చుచేశారు. ఎల్‌ఈడీ లైట్ల ప్రాజెక్టుతో 87.36 లక్షల యూనిట్ల విద్యుత్తు ఆదా అయింది.
  • శాంతిభద్రతల నిర్వహణకు రూ.1,941 కోట్లను వినియోగించారు.
  • డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు రూ.9,700కోట్లు ఖర్చుచేశారు. 111ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 
  • స్వచ్ఛహైదరాబాద్‌ కార్యక్రమం కింద 1,716 కోట్లను ఖర్చుచేశారు. చెత్తను సేకరించేందుకు 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్‌లను కొనుగోలు చేశారు. 3వేల పబ్లిక్‌టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. 
  • డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ కోసం రూ.15 కోట్లు వెచ్చించారు. 360 సిబ్బందికి అవసరమైన అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. 
  • హరిత హైదరాబాద్‌కు రూ.333 కోట్లు ఖర్చుచేశారు. ఆరేళ్లలో 8 కోట్ల మొక్కలు నాటారు. 59 అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్నారు. 
  • పార్క్‌ల కోసం రూ.250 కోట్లను ఖర్చుచేశారు. 934 పార్క్‌లు, 460 ట్రీ పార్క్‌లను అభివృద్ధిచేశారు. 
  • ప్రజారవాణా వ్యవస్థ మెరుగుకు రూ.160 కోట్లను ఖర్చుచేశారు. అందులో బస్‌షెల్లర్ట నిర్మాణం, ఆధునీకరణ కోసం రూ.45 కోట్లు వెచ్చించారు. 
  • క్రీడా సదుపాయల కల్పనకు రూ.98 కోట్లను వెచ్చించారు. 21 స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లతో పాటు 7 సిమ్మింగ్‌ ఫూల్స్‌ను నిర్మించారు. 
  • వైకుంఠధామాల కోసం రూ.67 కోట్లు వెచ్చించారు. అందులో ప్రత్యేకవార్డులు, వెయిటింగ్‌ హాళ్లు, పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. 
  • పెట్టుబడులను ఆహ్వానించేందుకు రూ.2,116 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేసింది. టీహబ్‌, తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, సాఫ్ట్‌నెట్‌, టాస్క్‌, టీవర్క్స్‌, వీహబ్‌ల ఏర్పాటుతో పాటు ఐటీ రంగ వృద్ధి,  టీఎ్‌సఐపాస్‌ కోసం వినియోగించింది. తద్వారా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్‌కు వచ్చాయి. 15 లక్షల మందికి ఉపాధి లభించింది.
  • రూ.377 కోట్లను చెరువుల పునరుద్ధరణకు ఖర్చుచేశారు. రూ.5 భోజనం కల్పించే అన్నపూర్ణ క్వాంటీన్ల నిర్వహణ కోసం రూ.152 కోట్లను వినియోగించారు. 250 బస్తీదవాఖాల కోసం రూ.31 కోట్లు ఖర్చుచేశారు. 
  • హైదరాబాద్‌లో చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు రూ.100 కోట్లు, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రూ.35 కోట్లు ఖర్చుచేశారు.

Updated Date - 2020-11-21T09:37:14+05:30 IST