క్షీణిస్తున్న సాయిబాబ ఆరోగ్యం!

ABN , First Publish Date - 2020-07-18T08:18:20+05:30 IST

మహారాష్ట్రలోని నాగపుర్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న సాయిబాబ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన సహచరి వసంతకుమారి అన్నారు. జైలులో కరోనా వ్యాప్తి, సాయిబాబ అనారోగ్యం దృష్ట్యా తక్షణమే ఆయనను

క్షీణిస్తున్న సాయిబాబ ఆరోగ్యం!

హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాగపుర్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న సాయిబాబ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన సహచరి వసంతకుమారి అన్నారు. జైలులో కరోనా వ్యాప్తి, సాయిబాబ అనారోగ్యం దృష్ట్యా తక్షణమే ఆయనను పెరోల్‌పై విడుదల చేయాలని ఆమె  కోరారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి.. తామే మెరుగైన చికిత్సను చేయించుకుంటామని ఆమె తెలిపారు. నాగపుర్‌ జైలులో దాదాపు 100 మంది  ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వైరస్‌ రోజురోజుకి వ్యాప్తి చెందుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-18T08:18:20+05:30 IST