మెదక్ జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్బంధం

ABN , First Publish Date - 2020-07-19T18:34:02+05:30 IST

విద్యుత్ బిల్లుల వసూళ్లకు వచ్చిన అధికారులను స్తంభానికి తాడుతో కట్టి నిర్బంధించారు.

మెదక్ జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్బంధం

మెదక్ జిల్లా: విద్యుత్ బిల్లుల వసూళ్లకు వచ్చిన అధికారులను గ్రామస్తులు స్తంభానికి తాడుతో కట్టి నిర్బంధించారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గా మండలం, ముస్లాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష జరుపుతున్నారు. విద్యుత్ మీటర్ రీడింగ్, బిల్లులు పరీశీలిస్తున్నారు. 

Updated Date - 2020-07-19T18:34:02+05:30 IST