మజీద్, ఆలయాల ధ్వంసాన్ని ఖండిస్తున్నాం: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-08-16T23:20:12+05:30 IST

సచివాలయంలో మజీద్, ఆలయాల ధ్వంసాన్ని ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మజీద్ కూల్చివేతపై

మజీద్, ఆలయాల ధ్వంసాన్ని ఖండిస్తున్నాం: ఉత్తమ్

హైదరాబాద్: సచివాలయంలో మజీద్, ఆలయాల ధ్వంసాన్ని ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మజీద్ కూల్చివేతపై ఎంపీ అసదుద్దీన్ సమాధానం చెప్పాలని, అసద్ మైనార్టీల పక్షాన ఉంటారా? సీఎం కేసీఆర్ పక్షాన ఉంటారా? అని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థన మందిరాల కూల్చివేతపై 22న జిల్లాల్లో నిరసనలు తెలుపుతామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ డివిజన్లలో ఓటర్ల విభజన అడ్డగోలుగా చేశారని తప్పుబట్టారు. గ్రేటర్‌లోని అర్హులలో ఒక శాతం ప్రజలకు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినా తాము పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌కు గ్రేటర్‌ ఎన్నికల ముందే బస్తీ దవాఖానాలు గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2020-08-16T23:20:12+05:30 IST