అనుమతి నిరాకరణ ఘటనపై స్పందించిన తెలంగాణ హోంశాఖ
ABN , First Publish Date - 2020-04-02T04:17:10+05:30 IST
డిప్యూటీ సీఎం మహమూద్ అలీని ముఖ్యమంత్రి సమీక్షకు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ హోంమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంను

హైదరాబాద్: డిప్యూటీ సీఎం మహమూద్ అలీని ముఖ్యమంత్రి సమీక్షకు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ హోంమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంను కలిసే విషయంలో హోంమంత్రికి ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవ్వలేదని తెలిపింది. హోంమంత్రి ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే పరిస్థితి ఏనాడు ఉండదని చెప్పింది. సీఎం రాజ్‌భవన్‌కు వెళ్తున్నారని తెలుసుకొని హోంమంత్రి అత్యవసర పనిమీద తన కార్యాలయానికి వెళ్లారని తెలంగాణ హోంమంత్రి కార్యాలయం స్పష్టం చేశారు.