అక్టోబర్‌ 3 నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-07T00:13:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కోసం నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

అక్టోబర్‌ 3 నుంచి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కోసం నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలుంటాయని వివరించింది. పరీక్షల షెడ్యూల్‌ను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. కోవిడ్‌ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ పలుమార్లు వాయిదా వేసింది. తాజాగా షెడ్యూల్‌ను సవరించి.. కొత్త పరీక్ష తేదిలను ప్రకటించింది. 

Updated Date - 2020-09-07T00:13:50+05:30 IST