వస్తు ఉత్పత్తిలో జైళ్ల శాఖ రికార్డు

ABN , First Publish Date - 2020-09-03T10:18:08+05:30 IST

వస్తు ఉత్పత్తిలో తెలంగాణ జైళ్ల శాఖ రికార్డు సృష్టించింది. 2019లో రూ.600 కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే మొదటి స్థానం సాధించింది.

వస్తు ఉత్పత్తిలో జైళ్ల శాఖ రికార్డు

  • రూ.600 కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే అగ్ర స్థానం

హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వస్తు ఉత్పత్తిలో తెలంగాణ జైళ్ల శాఖ రికార్డు సృష్టించింది. 2019లో రూ.600 కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే మొదటి స్థానం సాధించింది. ‘ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా-2019’ నివేదికను ఎన్‌సీఆర్బీ ఇటీవల విడుదల చేసింది. తెలంగాణ జైళ్లలోని ఒక్కో ఖైదీ రూ.9లక్షల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసినట్లు నివేదిక పేర్కొంది. తెలంగాణ తర్వాత తమిళనాడు రూ.73 కోట్లు, మహరాష్ట్ర రూ.30 కోట్ల వస్తువులను ఉత్పత్తి చేశాయి. 

Updated Date - 2020-09-03T10:18:08+05:30 IST