ఆ ముగ్గురిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2020-05-11T10:01:53+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపిన ..

ఆ ముగ్గురిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

  • గూలీఫిషన్‌, నఫురా, ఇష్రత్‌ విడుదలకు 
  • హైదరాబాద్‌ ముస్లిం మహిళా వేదిక డిమాండ్‌

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపిన గూలీ ఫిషన్‌, నఫురా జర్గన్‌, ఇష్రత్‌ జహాన్‌పై కేసులు మోపడాన్ని హైదరాబాద్‌ ముస్లిం మహిళా వేదిక తీవ్రంగా ఖండించింది. ఉపా చట్టం, రాజద్రోహం కేసులతో వారిని తీహార్‌ జైలుకు తరలించడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఈ మేరకు ఆదివారం వారు ప్రకటన విడుదల చేశారు. ఇతర విద్యార్థులు, సంస్థలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. కరోనా సోకకుండా భౌతిక దూరం పాటించాల్సిన ఈ సమయంలో.. నిరసనకారులను ఖైదీలతో కిక్కిరిసి ఉన్న జైళ్లకు పంపడం తగదని వేదిక ప్రతినిధులు అన్నారు. ‘ఢిల్లీలో వందలాది మందిని అకారణంగా అరెస్టు చేస్తున్నారు. కేసులను ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని’ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-11T10:01:53+05:30 IST