పేదలు, వలస కూలీల ఆకలి తీరుస్తూ...

ABN , First Publish Date - 2020-04-25T09:04:10+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలు, వలస కూలీలు, కార్మికులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నాడు ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త తలారి దినకరణ్‌.

పేదలు, వలస కూలీల ఆకలి తీరుస్తూ...

చేయూతనిస్తున్న సామాజిక కార్యకర్త తలారి దినకరణ్‌


రాంనగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలు, వలస కూలీలు, కార్మికులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నాడు ముషీరాబాద్‌  నియోజకవర్గంలోని గాంధీనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త తలారి దినకరణ్‌.లాక్‌డౌన్‌ ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు ముషీరాబాద్‌ , చిక్కడపల్లి, గాంధీనగర్‌, నల్లకుంట పరిధిలోని పేదలు నివసించే మురికివాడలు, బస్తీలు, కాలనీలకు వెళ్లి 10 కిలోల బియ్యం, కిలో నూనె, కిలో ఉల్లి, కిలో పప్పు, పసుపు, కారం పొడి, కూరగాయలతో కూడిన కిట్‌ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 2,500 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. అంతేకాకుండా పలురకాల పళ్లను పేదలకు అందిస్తున్నారు దినకరణ్‌ . ముషీరాబాద్‌, గాంధీనగర్‌, చిక్కడపల్లితోపాటు పలు పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. పికెట్‌లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అన్నదానం చేస్తున్నారు.  తన సొంత ఖర్చులతో  దినకరణ్‌ చేస్తున్న సేవలను పోలీసులు, ప్రజా ప్రతినిధులు అభినందింస్తున్నారు.  

Updated Date - 2020-04-25T09:04:10+05:30 IST