ఢిల్లీ ఘర్షణలు దురదృష్టకరం: ఎంపీ ప్రకాశ్
ABN , First Publish Date - 2020-03-13T09:10:35+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో మతఘర్షణలు జరగడం దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు దేశ లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేస్తాయని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ అన్నారు.

న్యూఢిల్లీ, మార్చి12 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో మతఘర్షణలు జరగడం దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు దేశ లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేస్తాయని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ అన్నారు. గురువారం రాజ్యసభలో ఢిల్లీ అల్లర్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ అల్లర్లలో 53 మంది మృతి చెంది వేలాదిగా గాయపడ్డారని, అపారమైన ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు.