175 దా‘రుణ’ యాప్‌లను తొలగించండి

ABN , First Publish Date - 2020-12-28T08:02:25+05:30 IST

175 దా‘రుణ’ యాప్‌లను తొలగించండి

175 దా‘రుణ’ యాప్‌లను తొలగించండి

గూగుల్‌కు పోలీసుల లేఖ

తాజాగా రాచకొండ, 

వరంగల్‌లో 6 అరెస్టులు

రూ. 1.42 కోట్లు ఫ్రీజ్‌

ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లపై 

ఈడీ కేసులకు చాన్స్‌


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, కొత్తపేట, వరంగల్‌ అర్బన్‌ క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దా‘రుణాల’ యాప్‌లపై నిషేధానికి తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. 175 ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించాలంటూ గూగుల్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ పోలీ్‌సస్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అందజేసి.. వేధింపులకు గురిచేస్తున్న ఇన్‌స్టంట్‌ రుణయా్‌పల జాబితాను జతచేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీ వసూలు చేస్తోన్న వైనాన్ని వివరించారు. గుగూల్‌ ప్లేస్టోర్‌లో మొత్తం 259 ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, తమకొచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తే 175 యాప్‌ల నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారని తేలిందని పోలీసులు వివరించారు. ప్లేస్టోర్‌లో ఉన్న యాప్‌లను అమాయకులు సులువుగా విశ్వసించే అవకాశముందని, వాటిని త్వరగా నిషేధించాలని పేర్కొన్నారు.


బాధితుల సంఖ్య మరింత పెరగకుండా ఉండేందుకు సహకరించాలని ఆ లేఖలో కోరారు. ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల ఆగడాలపై ఇప్పటికే హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధుల్లో 24 మందిని అరెస్టు చేశారు. ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల ని ర్వాహకులపై కొరడా ఝళిపిస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌ పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో నిందితుల పీచమణుస్తున్నారు. దేశంలో ఏ మూలన దాగినా.. సాంకేతిక పరిజ్ఞానంతో వారిని గురిస్తూ.. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు తరలిస్తున్నారు. ఆదివారం రాచకొండ, వరంగల్‌ కమిషనరేట్ల పరిధుల్లో ముగ్గురేసి చొప్పున దా‘రుణాల’ నిర్వాహకులకు బేడీలు పడ్డాయి. కాగా, తెలంగాణలో ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లపై ఈడీ కేసు పెట్టే అవకాశాలున్నాయి.


101 ల్యాప్‌టా్‌పలు స్వాధీనం

దా‘రుణాల’ యాప్‌ల నిర్వాహకులపై ఫిర్యాదులు అందుకున్న రాచకొండ పోలీసులు.. ఆదివారం పుణెలోని జియా లియాంగ్‌ ఇన్ఫోటెక్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 101 ల్యాప్‌టా్‌పలు, 106 మొబైల్‌ఫోన్లు, సీసీకెమెరాల డీవీఆర్‌, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 1.42 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. ఆదివారం విలేకరులకు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. పరశురాం లాహు తక్వే అనే వ్యక్తి పుణెలో ఉంటూ.. డైరెక్టర్‌ హోదాలో జియా లియాంగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మైక్రో ఫైనాన్స్‌/ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. చైనా జాతీయురాలైన అతని భార్య లి యాంగ్‌ టియాన్‌ ఆ సంస్థలో భాగస్వామి. అదే ప్రాంతానికి చెందిన ఎస్‌కే ఆకీబ్‌ కాల్‌సెంటర్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.


ఈ కంపెనీలో అమిత్‌ నందూ కల్బోర్‌ అనే వ్యక్తి కూడా భాగస్వామి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరంతా జూన్‌ నెలలో జియా లియాంగ్‌ కంపెనీని ప్రారంభించి, యాప్స్‌ ద్వారా రుణాలివ్వడం ప్రారంభించారు. అధిక వడ్డీలు (వారానికి 50ు దాకా) వసూలు చేస్తూ.. రుణాలు చెల్లించలేనివారికి లీగల్‌ నోటీసులిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే వీరి టార్గె ట్‌. ఒకటి రెండు సార్లు చిన్న మొత్తం రుణాలు తీసుకుని, సక్రమంగా చెల్లించేవారి ఖాతాల్లోకి.. అడగకుండానే డబ్బులు వేసి.. తిరిగి చెల్లించాలంటూ వేధిస్తుంటారు. గత నెల 18న ఉప్పల్‌కు చెందిన భూమన ప్రసాద్‌ ‘మై బ్యాంక్‌ యాప్‌’ ద్వారా రూ. 3,500 రుణం తీసుకుని, వారంలోగా చెల్లించారు. ఆ తర్వాత రూ. 4,500 తీసుకుని, తిరిగి చెల్లించారు. దీంతో.. అడక్కుండానే అతని బ్యాంకు ఖాతాలో వివిధ యాప్‌ల నుంచి రూ.26 వేలు జమ చేశారు. వడ్డీతో కలిపి రూ.44 వేలు వేశారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా.. అతని ఖాతా నుంచి ఎంతోకొంత ఖాళీ అవుతూనే ఉంది. అంతటితో ఆగకుండా.. ఇంకా డబ్బులు చెల్లించాలంటూ కాల్‌సెంటర్ల ద్వారా వేధించేవారు. అతని ఫోన్‌బుక్‌ను హ్యాక్‌ చేసి.. కాంటాక్టులో ఉన్నవారినీ అసభ్య పదజాలంతో ఇబ్బంది పెట్టేవారు. ప్రసాద్‌, మరొకరి నుంచి ఫిర్యాదు అందడంతో.. రాచకొండ పోలీసులు పుణె వెళ్లి.. పరశురాం, లియాంగ్‌, ఆకీబ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి 101 ల్యాప్‌టా్‌పలు, 106 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారికి సంబంధించిన హెచ్‌డీఎ్‌ఫసీ ఖాతాలోని రూ.1.42 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. మరో నిందితుడు నందూ పరారీలో ఉన్నాడు. 


ముగ్గురిని అరెస్టు చేసిన వరంగల్‌ పోలీసులు

ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ వేధింపుల కేసులో వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేరశారు. ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌ కుమార్‌ కథనం ప్రకారం.. దేబాశివ్‌దాస్‌(ఉత్తర బెంగళూరు, చిక్కాబన్స్‌వాడ), సంజయ్‌ బీఆర్‌, సంతో్‌షకుమార్‌ నాయక్‌(బెంగళూరు), ఎర్రీక్‌ పెంగ్లూ(చైనా), పాడ్రా బిందారాయ్‌(ఒడిసా) ఆన్‌లైన్‌ రుణాల దందా చేస్తున్నారు. ఎర్రీక్‌ పెం డ్లూ వ్యాపార వీసాపై 2019లో వచ్చి ఒడిసాకు చెందిన పాడ్రాబిందారాయ్‌తో కలిసి ఐదు ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లను రూపొందించారు. బెంగళూరు కేంద్రంగా షైన్‌బే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఆఫీసును ఏర్పాటు చేశారు. దేబాశి్‌సదాస్‌, సంజయ్‌, సంతో్‌షకుమార్‌ సహకారంతో ఫాస్ట్‌ క్రెడిట్‌ యాప్‌ల ద్వారా ఇన్‌స్టంట్‌ లోన్‌ రు ణాలు మంజూరు చేస్తారు.


సామాన్యులకు, డబ్బు తిరిగి చెల్లించడంలో జాప్యం చేసే వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటారు. జనగామ జిల్లా గుడ్లగడ్డకు చెందిన బంగారు శ్రీనివాస్‌ వీరి నుంచి రూ.4వేల రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీ వేసి డబ్బులు తిరిగి చెల్లించాలని కాల్‌ చేసి, వేధింపులకు గురిచేశారు. వాటిని భరించలేక శ్రీనివాస్‌ ఈ నెల 18న జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులో దేబాశిశ్‌దాస్‌, సంజయ్‌ బీఆర్‌, సంతో్‌షకుమార్‌ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెంగ్లూ, పాండ్రాబిన్‌దారాయ్‌ పరారీలో ఉన్నారు.

Updated Date - 2020-12-28T08:02:25+05:30 IST