9న హైదరాబాద్‌కు 80 దేశాల ప్రతినిధులు

ABN , First Publish Date - 2020-12-05T08:34:07+05:30 IST

కోవ్యాక్సిన్‌ను అభివృద్ధిచేసిన హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ కంపెనీ ప్లాంటును ఈ నెల 9న (బుధవారం) విదేశీ ప్రతినిధుల

9న హైదరాబాద్‌కు 80 దేశాల ప్రతినిధులు

 భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ ప్లాంట్ల సందర్శన

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కోవ్యాక్సిన్‌ను అభివృద్ధిచేసిన హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ కంపెనీ ప్లాంటును ఈ నెల 9న (బుధవారం) విదేశీ ప్రతినిధుల బృందం సందర్శించనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. దాదాపు 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు ఈ బృందంలో ఉంటారని తెలిపారు. కరోనా వ్యాక్సిన్లపై దేశంలో జరుగుతున్న కీలక పరిశోధనలను వారికి పరిచయం చేయడానికే భారత విదేశాంగ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.


ఈ పర్యటనను పర్యవేక్షించే అడ్వాన్స్‌ టీమ్‌ ప్రతినిధులు, చీఫ్‌ ప్రొటొకాల్‌ ఆఫీసర్‌ నగే్‌షసింగ్‌, పలువురు ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో శుక్రవారం సమావేశమైన సీఎస్‌..  విదేశీ బృందం సభ్యుల సౌకర్యార్ధం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ బృందం భారత్‌ బయోటెక్‌తో పాటు బయోలాజికల్‌-ఈ ప్లాంట్లను సందర్శిస్తుందని వెల్లడించారు. అన్ని సదుపాయాలున్న 5 బస్సులను ఏర్పాటు చేయాలని, ఒక వైద్య బృందాన్ని వారి వెంట ఉంచాలని చెప్పారు.


ఫార్మా సిటీ, జీనోమ్‌ వ్యాలీలతో పాటు వ్యాక్సిన్ల తయారీలో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యంపై ఆయా దేశాల ప్రతినిధుల ఎదుట ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నామని సోమేశ్‌ వెల్లడించారు. కార్యక్రమంలో జీఏడీ, రోడ్లు-భవనాలు, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు వికా్‌సరాజ్‌, సునీల్‌శర్మ, జయేశ్‌రంజన్‌, సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T08:34:07+05:30 IST