ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోంది: హైకోర్టు
ABN , First Publish Date - 2020-09-14T22:24:52+05:30 IST
డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కోర్టును పిటిషనర్లు కోరారు. ఆన్‌లైన్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు
హైదరాబాద్: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కోర్టును పిటిషనర్లు కోరారు. ఆన్‌లైన్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలుకాదని, గ్రామీణప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య తలెత్తె అవకాశం ఉందని, పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులర్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అటానమస్ కాలేజీలకు మాత్రమే ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అనుమతిచ్చామని, క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తామని ఓయూ కోర్టు తెలిపింది. ఆన్‌లైన్‌లో మిడ్‌టర్మ్, ఆఫ్‌లైన్‌లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని జేఎన్టీయూ పేర్కొంది. ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందని, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏదో ఒక విధానం ఉండాలని హైకోర్టు పేర్కొంది.