రేపటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్ తరగతులు
ABN , First Publish Date - 2020-12-06T07:46:01+05:30 IST
డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు సోమవారం నుంచి నుంచి ఆన్‌లైన్లో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. దోస్త్ చివరి విడత
ముగిసిన ‘దోస్త్’ కౌన్సిలింగ్.. 27,365 సీట్లు భర్తీ
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు సోమవారం నుంచి నుంచి ఆన్‌లైన్లో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. దోస్త్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రవేశాల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నెల 3న ముగిసిన కౌన్సెలింగ్ ఫలితాలను కాలేజియేట్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి శనివారం విడుదల చేశారు.
చివరి విడతలో మొత్తం 28,136 మంది వెబ్ ఆప్షన్లను ఇవ్వగా వీరిలో 27,365 మందికి సీట్లు ఖరారు చేశామని వారు తెలిపారు. సరిపడా వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 771 మంది సీట్లు పొందలేకపోయారని చెప్పా రు. చివరి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారంలోపు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని వారు సూచించారు.
దోస్త్‌ను మొత్తం 5 విడతలలో కౌన్సిలింగ్ నిర్వహించగా.. 1,58,067 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల పరిఽధిలో మొత్తం 986 డిగ్రీ కాలేజీలుండగా ఇందులో 4,09,450 సీట్లున్నాయి. మొదటి రెండు విడతల్లో 1,44,886, మూడో విడతలో 57,695, ప్రత్యేక విడతలో 21,437 సీట్లు భర్తీ అయ్యాయి. చివరి విడతలో 27,365 మందికి సీట్లు ఖరారు చేశారు.