వరద నీటిలో చిక్కుకున్న జింకలు
ABN , First Publish Date - 2020-08-20T21:14:35+05:30 IST
నిజామాబాద్: నందిపేట్ మండలం నడి కూడా గాడేపల్లి గ్రామాల్లో వరద నీటిలో జింకలు చిక్కుకున్నాయి.

నిజామాబాద్: నందిపేట్ మండలం నడి కూడా గాడేపల్లి గ్రామాల్లో వరద నీటిలో జింకలు చిక్కుకున్నాయి. నది మధ్యలో 5 జింకలను స్థానిక మత్స్యకారులు కాపాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల జింకలు సందడి చేశాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో వరద పెరగడంతో నది పరివాహక ప్రాంతం మునిగింది. దీంతో జింకలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. జింకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. వాటి రక్షణకు శాశ్వత పరిష్కారం.. చూపాలని మత్స్యకారులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.