పోలింగ్ తగ్గడం ఆందోళనకరం: కోదండరాం
ABN , First Publish Date - 2020-12-03T07:53:00+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం ఆందోళన కరమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజల

హైదరాబాద్,డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం ఆందోళన కరమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజల భాగస్వామ్యం తగ్గడం ప్రజాస్వామ్యానికి చేటన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల వల్లా ప్రజల భాగస్వామ్యం దెబ్బతింటుందని చెప్పారు.
భావోద్వేగ అంశాలపైనే చర్చ జరగడంతో ఎన్నికలకు ప్రజలు దూరంగా ఉన్నారన్నారు. ఢిల్లీలో 35 సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి టీజేఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని కోదండరాం తెలిపారు.