భార్యకు టోకరా... రూ. కోటికి...

ABN , First Publish Date - 2020-06-19T20:55:31+05:30 IST

సాప్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోన్న భార్యను చిత్రహింసలకు గురి చేసాడు భర్త సంతోష్. అంతేకాదు... ఆమెకు టోకరా ఇచ్చి రూ. కోటి కొట్టేశాడు. వివరాలిలా ఉన్నాయి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోన్న భార్యకు... మరో వ్యక్తి పేరుతో మెసేజ్‌లు పంపి వేధింపులకు గురి చేసాడు.

భార్యకు టోకరా... రూ. కోటికి...

హైదరాబాద్ : సాప్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోన్న భార్యను చిత్రహింసలకు గురి చేసాడు భర్త సంతోష్. అంతేకాదు... ఆమెకు టోకరా ఇచ్చి రూ. కోటి కొట్టేశాడు. వివరాలిలా ఉన్నాయి.


అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోన్న భార్యకు... మరో వ్యక్తి పేరుతో మెసేజ్‌లు పంపి వేధింపులకు గురి చేసాడు. ఆ క్రమంలోనే... ఆమె నుంచి కోటి రూపాయలు కొట్టేసాడు సంతోష్. మిత్రుడి పేరుతో భార్యకే అశ్లీల వీడియోలు ఫోటోలు పంపి వేధింపులకు గురి చేసాడు.


కోటి రూపాయలు పంపించకపోతే... ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి, మీ కుటుంబ సభ్యులకు పంపుతానంటూ బెదిరించాడు. మన ఛాటింగ్ విషయం కూడా మీ ఆయనకు చెబుతానంటూ హెచ్చరికలు చేభాడు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు.


అయితే భర్త సంతోష్ పైన భార్యకు అనుమానం వచ్చింది. అదే క్రమంలో... సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. 

Updated Date - 2020-06-19T20:55:31+05:30 IST