డిగ్రీ పరీక్షల్లో 40 మంది డీబార్
ABN , First Publish Date - 2020-10-07T06:24:45+05:30 IST
కేయూ పరిధిలో జరుతున్న డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 40 మంది

కేయూ క్యాంపస్, అక్టోబరు 6 : కేయూ పరిధిలో జరుతున్న డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 40 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.మహేందర్‌రెడ్డి, అదనపు అధికారి డాక్టర్ వై.వెంకయ్య వివరాల మేరకు వరంగల్‌లో 32, ఖమ్మంలో 7, ఆదిలాబాద్‌లో ఒక్కరు డీబార్ అయ్యారు. హన్మకొండ కేడీసీలో 8, వరంగల్ సీకేఎంలో 5, హన్మకొండ న్యూసైన్స్‌లో 5, మాస్టర్జీలో 4, ఆరోరాలో 3, చేర్యాల దగ్గర మద్దూరు సాహితీ డిగ్రీ కళాశాలలో 3, నర్సంపేటలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో 1, హన్మకొండ ఎస్సాఆర్‌లో 1, వరంగల్ మహబూబీయా పంచదాన్‌లో ఇద్దరూ విద్యార్థులు డీబారైనట్లు అధికారులు తెలిపారు.