ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసిన డీడీ

ABN , First Publish Date - 2020-12-11T05:21:17+05:30 IST

మండలంలోని చల్పాక, మల్యాలలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ మంకిడి ఎర్రయ్య గురువారం తనిఖీ చేశారు.

ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసిన డీడీ
చల్పాకలో రిజిస్టర్లను పరిశీలిస్తున్న డీడీ ఎర్రయ్య

ఏటూరునాగారం రూరల్‌, డిసెంబరు 10: మండలంలోని చల్పాక, మల్యాలలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ మంకిడి ఎర్రయ్య గురువారం తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో నిర్మితమవుతున్న సోలార్‌ వాటర్‌ హీటర్‌ సిస్టమ్‌, డిజిటల్‌ తరగతుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డిజిటల్‌ తరగతుల ద్వారా గిరిజన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ఆన్‌లైన్‌ తరగతుల విద్యార్థులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ తరగతులు వినేలా అవగాహన కల్పించాలని అన్నారు.

Read more