‘ఆ నలుగురు..’ కన్నబిడ్డలే!!
ABN , First Publish Date - 2020-02-08T10:10:50+05:30 IST
ఆ తండ్రికి కొడుకులు లేని లోటును కూతుళ్లు తీర్చారు. వెలకట్టలేని ప్రేమను పంచి, విద్యాబుద్ధులు నేర్పించి, జీవితాల్లో స్థిరపడేలా చేసిన నాన్న

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతుళ్లు
మహబూబ్‌నగర్ క్రైం, ఫిబ్రవరి 7: ఆ తండ్రికి కొడుకులు లేని లోటును కూతుళ్లు తీర్చారు. వెలకట్టలేని ప్రేమను పంచి, విద్యాబుద్ధులు నేర్పించి, జీవితాల్లో స్థిరపడేలా చేసిన నాన్న మరణించడంతో కూతుళ్లే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.. రెండు రోజుల క్రితం ధర్మాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్‌నగర్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టర్, పౌలీ్ట్ర వ్యాపారి కే.వెంకటేశ్వర్‌రావు మృతిచెందారు. దీంతో ఐదుగురు కుమార్తెలు లక్ష్మి(న్యూరో టెక్నాలజిస్టు- రెయిన్ బో ఆస్పత్రి), జ్యోతి(మల్లారెడ్డి జూనియర్ కళాశాల అసోసియేట్ మెంబర్), సంధ్య(మహబూబ్‌నగర్- ఆర్‌అండ్‌బీ డీఈ), స్వాతి(గృహిణి), గీత(సా్‌ఫ్టవేర్ ఉద్యోగి-కెనడా) ఇంటికి చేరుకున్నారు. నలుగురు కుమార్తెలు పాడెను ఎత్తి అంతిమ యాత్రలో పాల్గొనగా, మరో కుమార్తె సంధ్య తల్లికి తోడుగా ఉన్నారు. పెద్ద కూతురు లక్ష్మి తండ్రికి తలకొరివి పెట్టారు.