జగదీశ్‌రెడ్డిపై గవర్నర్ దత్తాత్రేయ ప్రసంశలు
ABN , First Publish Date - 2020-07-18T23:08:00+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో అంకిత భావంతో పనిచేసి చురుకైన పాత్ర నిర్వహించిన వ్యక్తి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అని హిమాచత్ ప్రదేశ్ గవర్నర్ బండారుదత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అంకిత భావంతో మంత్రి జగదీశ్‌రెడ్డి పనిచేశారని హిమాచత్ ప్రదేశ్ గవర్నర్ బండారుదత్తాత్రేయ ప్రసంశలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి విద్యాశాఖ మంత్రిగా తాజాగా విద్యుత్‌శాఖ మంత్రిగా బాద్యతాయుత పదవులు నిర్వహిస్తున్న జగదీశ్‌రెడ్డి అభినందనీయుడని అన్నారు. శనివారం ఆయన జన్మదినం సందర్భంగా దత్తాత్రేయ టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో సౌమ్యులుగా, సహనశీలిగా జగదీశ్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన మరిన్ని మంచి పదవులను నిర్వహించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు.