గవర్నర్‌ తమిళిసైను కలిసిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌

ABN , First Publish Date - 2020-12-11T21:14:51+05:30 IST

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌ తమిళిసైను కలిసిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌

హైదరాబాద్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తనను కలిసేందుకు వచ్చిన దత్తాత్రేయకు గవర్నర్‌ తమిళిసై సాదరంగా ఆహ్వానించారు. ఇరువురు గవర్నర్లు కొంత సేపు వివిధ అంశాలపై చర్చించారు. 

Updated Date - 2020-12-11T21:14:51+05:30 IST