29న దత్తయ్యగుట్టపై..ఎద్దుల బండ్ల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-12-25T06:19:05+05:30 IST

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామ శివారులో కొండసోరికల నడు మ కొలువైన దత్తాచల క్షేత్రంలో ఈ నెల 25నుంచి 30 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

29న దత్తయ్యగుట్టపై..ఎద్దుల బండ్ల ప్రదర్శన

హత్నూర, డిసెంబరు24: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామ శివారులో కొండసోరికల నడుమ కొలువైన దత్తాచల క్షేత్రంలో ఈ నెల 25నుంచి 30 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దత్తయ్యగుట్టగా పేరుగాంచిన ఈ ఆలయపరిధిలో దత్తాత్రేయస్వామి జయంతి సందర్భం గా 29న ఎద్దుల బండ్ల ప్రదర్శన ఉంటుంది. ఈ క్షేత్రానికి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి దౌల్తాబాద్‌ మీదుగా, పటాన్‌చెరు నుంచి గానీ చేరుకోవచ్చు. తొలుత ఈ ఆలయం గుహగా ఉండేది. ఐదేళ్ల క్రితం కొన్ని బండరాళ్లను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు క్షేత్ర నిర్వాహకుడు, శ్రీచక్ర ఉపాసకుడు సభాపతిశర్మ తెలిపారు. 

Updated Date - 2020-12-25T06:19:05+05:30 IST