చదువుకునే రోజుల నుంచి మాకు పరిచయం వుంది- దత్తాత్రేయ

ABN , First Publish Date - 2020-07-10T22:05:48+05:30 IST

దివంగత మాజీ ఎమ్మెల్యే పి.రామస్వామితో తనకు చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉందని, తామిద్దరమూ గౌలిగూడ ప్రాంతవాసులమని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

చదువుకునే రోజుల నుంచి మాకు పరిచయం వుంది- దత్తాత్రేయ

హైదరాబాద్‌: దివంగత మాజీ ఎమ్మెల్యే పి.రామస్వామితో తనకు చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉందని, తామిద్దరమూ గౌలిగూడ ప్రాంతవాసులమని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సీనియర్‌ బీజేపీనేత, మాజీ మంత్రి పి.రామస్వామి గురువారం మృతి చెందారు. ఈసందర్బంగా దత్తాత్రేయ రామస్వామితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. రామస్వామి కబడ్డీబాగా ఆడేవారని, సంఘర్షణలతో మున్సిపల్‌కార్పొరేటర్‌ నుంచి రాజకీయ ప్రస్ధానం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగారని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. నీటికి నిజాయితీకి మారుపేరుగా ఉండేవారన్నారు. నగరంలోని అనేక దేవాలయాల అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేశారని చెప్పారు. 


పాతబస్తీలో గొడవలు జరిగినప్పుడు రామస్వామి అక్కడ పర్యటించి ప్రజలకు మనోధెర్య  నింపేవాడని తెలిపారు. మజ్లిస్‌నాయకులతో సన్నిహిత సంబంధాలుఉన్పప్పటికీ ఈ విషయంలో వారితో తీవ్రంగా విభేదిఇవంచే వారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు, కార్యకర్తలకు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని పేర్కొన్నారు. నిరుపేదల ఇండ్లలో చావులకు, పెళ్లిళ్లకు ముందు నిలబడి కార్యక్రమాలు జరిపించేవాడని గుర్తుచేసుకున్నారు. రామస్వామిని టైగర్‌ రామస్వామిగా

Updated Date - 2020-07-10T22:05:48+05:30 IST