ఘనంగా దత్త జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2020-12-30T04:02:20+05:30 IST
ఘనంగా దత్త జయంతి వేడుకలు
మహదేవపూర్, డిసెంబరు 29 : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో దత్తజయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ఆల యంలోఅభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టీసీ గుడాల అరుణ, సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత తదితరులు పాల్గొన్నారు.
కాటారం: మండలంలో దత్తాత్రేయస్వామి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గారెపల్లిలోని అభయాంజనేయస్వామి ఆలయం, రేగుల గూడెంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో వేద పండితులు మాడుగుల నాగరాజు శర్మ, వేదాంతం గణేష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా మహిళలు పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు.