రూ.12 వేలకు దర్శన టికెట్లు
ABN , First Publish Date - 2020-11-27T08:05:19+05:30 IST
ఓ రాజకీయ నాయకుడి సిఫారసు లేఖపై మూడు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను పొందిన ఓ దళారీ వాటిని రూ.12 వేలకు విక్రయించిన

ఆదిలాబాద్ ఎంపీ లేఖ ఫోర్జరీ
తిరుమల/ ఆదిలాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఓ రాజకీయ నాయకుడి సిఫారసు లేఖపై మూడు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను పొందిన ఓ దళారీ వాటిని రూ.12 వేలకు విక్రయించిన ఘటన తిరుమలలో గురువారం వెలుగుచూసింది. విజిలెన్స్ అధికారులు కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన నరేష్ ఇద్దరు స్నేహితులతో మంగళవారం తిరుమలకు వచ్చాడు.
తిరుపతికి చెందిన రాఘవ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సిఫారసు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనానికి 3 టికెట్లు తీసుకుని రూ.12వేలకు నరే్‌షకు విక్రయించాడు. బుధవారం ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకున్న నరేష్ బృందాన్ని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా రాఘవ వద్ద టికెట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.
ఈ మేరకు రాఘవ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఎంపీని వివరణ కోరగా.. తనకు రాఘవ అనే వ్యక్తి ఎవరో తెలియదని, తన లేఖను ఫోర్జరీ చేశారని చెప్పారు.