జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే: రాఘవులు

ABN , First Publish Date - 2020-03-23T10:16:04+05:30 IST

కరోనా విషయంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో ప్రమాదం పొంచి ఉంటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే: రాఘవులు

కరోనా విషయంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో ప్రమాదం పొంచి ఉంటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హెచ్చరించారు. పేదలకు ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లు అందించడంతో పాటు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం జనతా కర్య్ఫూ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లోనే ఆయన ఉన్నారు. సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చప్పట్ల ద్వారా సంఘీభావం ప్రకటించారు. రాఘవులు వెంట పార్టీ నాయకులు బి. వెంకట్‌, టి.జ్యోతి, పి.ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-03-23T10:16:04+05:30 IST