దామోదర్ కోసం విస్తృతంగా గాలింపు

ABN , First Publish Date - 2020-12-18T00:11:58+05:30 IST

సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర యాక్షన్‌ టీం కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ టార్గెట్‌గా పోలీసులు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

దామోదర్ కోసం విస్తృతంగా గాలింపు

భద్రాద్రి: సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర యాక్షన్‌ టీం కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ టార్గెట్‌గా పోలీసులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. దామోదర్ దళం గుండాల ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. గుండాల, కరకగూడెం, బయ్యారం ప్రాంతంలో మావోయిస్ట్‌ దామోదర్ దళం సంచారిస్తోందని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మావోయిస్టుల్లోకి రిక్రూట్‌మెంట్‌తోపాటు ఇన్‌ఫార్మర్లపై దాడులకు దామోదర్‌ సూత్రధారిగా భావిస్తున్నారు. దీంతో దామోదర్‌ను పట్టిస్తే రూ.20లక్షల బహుమతి ఇస్తామంటూ ములుగు జిల్లా ఏజెన్సీలో వేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ములుగు జిల్లా తాడ్యాయి మండలం కాల్వలపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ 1997లో అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూపులో చేరాడు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. 

Updated Date - 2020-12-18T00:11:58+05:30 IST