మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలో పంటలకు నష్టం

ABN , First Publish Date - 2020-10-19T08:26:47+05:30 IST

భారీ వర్షాలతో మేడ్చల్‌జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. శనివారం రాత్రి జిల్లాలో సగటున 6సెంమీటర్ల వర్షపాతం నమోదైంది.

మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలో పంటలకు నష్టం

మేడ్చల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో మేడ్చల్‌జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. శనివారం రాత్రి జిల్లాలో సగటున 6సెంమీటర్ల వర్షపాతం నమోదైంది. ఘట్‌కేసర్‌, మేడిపల్లిలో మండలాల్లో 18సెంటిమీర్ల వర్షపాతం నమోదైంది. ఘట్‌కేసర్‌ మండలంలోని వెంకటాపూర్‌ తాళ్లకుంట చెరువు కట్టకు గండిపడటంతో దాదాపు 200ఎకరాలల్లో వరి నీటమునిగింది. కొర్రెముల, ఎదులాబాద్‌, అంకుశాపూర్‌, మర్రిపల్లిగూడ, ప్రతా్‌పసింగారం, కాచవానిసింగారం, ఘణపుర గ్రామాల్లో వెయ్యి ఎకరాలలో వరిపంట ఒరిగిపోయింది. మాదారం భూనాదిగాని కాలువ పొంగి వందఎకరాల్లో వరి చేను నేలకు వాలింది.  జిల్లాలో వర్షాలతో ఇప్పటిదాకా 2607 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదిరత మండలాల్లోని పంటపొలాల్లోకి నీరు చేరి పూర్తిగా దెబ్బతిన్నాయి. నందిగామ మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న, కంది పంటకు తెగుళ్ళతో పాటు ఎర్రబారి పోయింది.  నందివనపర్తిలోని కాముని చెరువు, నజ్దిక్‌సింగారంలోని రెండు కుంటలు పూర్తిగా నిండి ఏ క్షణం కట్ట తెగుతుందోనని రైతులు ఆందోళనచెందుతున్నారు.  మేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి గ్రామాల చెరువులు అలుగులు పారుతుండడంతో తక్కళ్లపల్లి, చింతపట్ల, మల్కీజ్‌గూడ గ్రామాల్లో చెరువులు నిండాయి.  

Updated Date - 2020-10-19T08:26:47+05:30 IST