డెయిరీ ఉత్పత్తులు ప్రజలకు మరింత అందుబాటులోకి తెస్తాం- తలసాని

ABN , First Publish Date - 2020-02-13T00:10:47+05:30 IST

విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పెద్దసంఖ్యలో ఔట్‌లెట్‌లను ఏర్పాటుచేస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు.

డెయిరీ ఉత్పత్తులు ప్రజలకు మరింత అందుబాటులోకి తెస్తాం- తలసాని

: విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పెద్దసంఖ్యలో ఔట్‌లెట్‌లను ఏర్పాటుచేస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. బుధవారం మాదాపూర్‌లోని పశువైద ్యశాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయా డెయిరీ ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నగరంలో విజయవాడెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం నూతనంగా ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.


ప్రజల నుంచి కూడా తమ ప్రాంతాల్లోఔట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌లు వస్తున్నాయని మంత్రి తెలిపారు. మాదాపూర్‌ ప్రాంత ప్రజలకు కూడా విజయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇక్కడ నూతన ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే విజయా డెయిరీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విజయ డెయిరీని ఎంతో అభివృద్ది చేశామన్నారు. పశుసంవర్ధక, డెయిరీ అధికారులు సమన్వయంతో పనిచేసి పాల సేకరణను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, విజయాడెయిరీ ఎండి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-02-13T00:10:47+05:30 IST