ఇమ్యూనిటీ పెంచే ఐస్‌క్రీం.. మార్కెట్లోకి కొత్తగా రాక

ABN , First Publish Date - 2020-06-19T00:46:25+05:30 IST

మార్కెట్లోకి కొత్తరకం ఐస్‌క్రీంలు తయారుచేసినట్లు డెయిరీ డే ప్లస్ సంస్థ పేర్కొంది. దాదాపు 10 రకాల...

ఇమ్యూనిటీ పెంచే ఐస్‌క్రీం.. మార్కెట్లోకి కొత్తగా రాక

హైదరాబాద్: మార్కెట్లోకి కొత్తరకం ఐస్‌క్రీంలు తయారుచేసినట్లు డెయిరీ డే ప్లస్ సంస్థ పేర్కొంది. దాదాపు 10 రకాల ఐస్‌క్రీంలను తయారుచేస్తున్నామని, అందులో పసుపు, వవన్‌ప్రాష్‌లను కలిపిన రకాలు భారీ పాపులర్ అయ్యాయని, వీటిద్వారా ప్రజల్లో ఇమ్యూనిటీ పెరుగుతుందని తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో ఈ కొత్త ఐస్‌క్రీంలను నేడు విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ కొత్త తరహా ఐస్‌క్రీంలు దాదాపు 30వేల దేశాలలో అందుబాటులో ఉన్నాయని వివరించింది. ఎన్నో ఏళ్లుగా పసుపు, పాలతో ఐస్క్రీంలను తయారు చేస్తున్నాని, అయితే ఇప్పుడు చవన్‌ప్రాష్‌ను వినియోగించి మరో కొత్త రకం ఐస్‌క్రీంను తయారు చేసినట్లు తెిపింది. ఈ ఐస్‌క్రీంల ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఐస్‌క్రీంల ధలు డెయిరీ డే ప్లస్ ప్రకటించింది. పసుపు, చవన్‌ప్రాష్ ఐస్‌క్రీంల ధర రూ.20గా ఉందని, ఇక ఫ్యామిలీ పాక్ అయితే రూ.199 వరకు పలుకుతోందన ప్రకటించింది.

Updated Date - 2020-06-19T00:46:25+05:30 IST