‘డీ మార్ట్’ వాటం...

ABN , First Publish Date - 2020-05-18T23:12:47+05:30 IST

‘డీ మార్ట్’ అంటే... నమ్మకానికి మరో పేరులా భావిస్తారు వినియోగదారులు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న డీ మార్ట్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకమది. మరి ఆ డీమార్టే మోసానికి పూనుకుంటే... ఏం చెప్పాలి. తాజాగా జరిగిందిదే. పొరపాటుగా జరిగిందో, కావాలనే చేశారో తెలియదు కానీ... మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ‘డీ మార్ట్’లో వెలుగుచూసిన మోసం... అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది.

‘డీ మార్ట్’ వాటం...

మేడ్చల్ : ‘డీ మార్ట్’ అంటే... నమ్మకానికి మరో పేరులా భావిస్తారు వినియోగదారులు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న డీ మార్ట్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకమది. మరి ఆ డీమార్టే మోసానికి పూనుకుంటే... ఏం చెప్పాలి. తాజాగా జరిగిందిదే. పొరపాటుగా జరిగిందో, కావాలనే చేశారో తెలియదు కానీ... మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ‘డీ మార్ట్’లో వెలుగుచూసిన మోసం... అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది.


ఒకటీ, రెండూ కాదు... పదుల సంఖ్యలో సరుకుల కొలతల్లో తేడాలు వస్తుండడంతో నిర్ఘాంతపోయిన శివసాయినగర్‌కు చెందిన పలువురు వినియోగదారులు... ఆందోళనలకు దిగారు. అలాగే... ఏ పదో, ఇరవయ్యో కాదు... కొన్ని సరుకుల్లో కిలోకు ఏకంగా 300 గ్రాముల వరకూ తూకంలో తేడాలొచ్చాయి. చివరకు... పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ కొనుగోలుదారులను దుకాణం సిబ్బంది వేడుకోవాల్సి వచ్చింది.


అయినప్పటికీ ఫిర్యాదులు రావడంతో... పోలీసులు రంగప్రవేశం చేసి, అక్కడి వేయింగ్ మెషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, తూనికలు, కొలతల శాఖ అధికారులను వినియోగదారులు కోరారు. 

Updated Date - 2020-05-18T23:12:47+05:30 IST