బ్రేకింగ్ న్యూస్: ఇంట్లో పేలిన సిలిండర్లు, భారీ శబ్దాలతో మంటలు

ABN , First Publish Date - 2020-03-26T02:53:09+05:30 IST

యూసఫ్‌గూడలోని జవహార్ నగర్‌లోని ఓ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే ఇంట్లో

బ్రేకింగ్ న్యూస్: ఇంట్లో పేలిన సిలిండర్లు, భారీ శబ్దాలతో మంటలు

హైదరాబాద్: యూసఫ్‌గూడలోని జవహార్ నగర్‌లోని ఓ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే ఇంట్లో ఎంత మంది ఉన్నారో, వారి పరిస్థితి ఏంటనేది ఎవరికీ తెలియదు. సిలిండర్ పేళుల్లతో ఇంట్లో ఉన్నవారు చనిపోయి ఉంటారని స్థానికులు భయాందోళనతో చెబుతున్నారు. కాగా పోలీసులకు, ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇప్పటికే ఘటనా స్థాలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more