ఐదుగురు సెల్‌ఫోన్ దొంగలను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ జాయింట్ సీపీ

ABN , First Publish Date - 2020-06-26T20:45:33+05:30 IST

హైదరాబాద్: నార్సింగి పోలీసులు కర్నూల్‌కు చెందిన ఐదుగురు సెల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేశారని సైబరాబాద్ జాయింట్ సీపీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు.

ఐదుగురు సెల్‌ఫోన్ దొంగలను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ జాయింట్ సీపీ

హైదరాబాద్: నార్సింగి పోలీసులు కర్నూల్‌కు చెందిన ఐదుగురు సెల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేశారని సైబరాబాద్ జాయింట్ సీపీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. రూ.8 లక్షల విలువైన 52 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చిన్నా అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై సెల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు.


కర్నూల్‌లో గతంలో చోరీ కేసుల్లో చిన్నా అరెస్ట్ అయ్యాడని సీపీ తెలిపారు. శ్రీనివాస్, కిశోర్, చిన్నాలు మరో ఇద్దరు కలిసి ముఠాగా ఏర్పడ్డారన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, లింగంపల్లి ప్రాంతాలతో పాటు సిటీ చుట్టుపక్కన చోరీలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. 

Updated Date - 2020-06-26T20:45:33+05:30 IST