ఓటీపీ చెప్పు.. మద్యం పట్టు!

ABN , First Publish Date - 2020-04-21T09:50:26+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో మందుబాబుల వీక్‌నెస్‌.. సైబర్‌నేరగాళ్లకు ఆయుధంలా మారింది.

ఓటీపీ చెప్పు.. మద్యం పట్టు!

సైబర్‌ నేరగాళ్ల నయా దందా

అప్రమత్తంగా ఉండాలి: సైబర్‌క్రైం పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో మందుబాబుల వీక్‌నెస్‌.. సైబర్‌నేరగాళ్లకు ఆయుధంలా మారింది. ఆన్‌లైన్‌లో మద్యం కొంటే డోర్‌ డెలివరీ చేస్తామంటూ ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని మద్యం దుకాణాల పేర్లతో ఫేస్‌బుక్‌లో నకిలీ పేజీలను సృష్టిస్తున్నారు. వారి ఉచ్చులో చిక్కుకునేవారి నుంచి తొలుత సగం డబ్బును వసూలు చేస్తారు. ఇందుకోసం కార్డు నంబరు, గడువు తేదీ, సీవీవీ నంబరు తీసుకుని... వినియోగదారుడికే ఫోన్‌ చేసి, ఓటీపీ తెలుసుకుని, ఖాతాలో డబ్బును కొల్లగొడుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-04-21T09:50:26+05:30 IST