వినూత్నంగా పంటలు పండించండి
ABN , First Publish Date - 2020-05-29T09:56:51+05:30 IST
రైతులు వినూత్నంగా పంటలు సాగు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామంలో రైతు లింబారెడ్డి సాగు చేస్తున్న హిమాచల్ యాపిల్

ముప్కాల్, మే 28: రైతులు వినూత్నంగా పంటలు సాగు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామంలో రైతు లింబారెడ్డి సాగు చేస్తున్న హిమాచల్ యాపిల్ తోటను ఆయన పరిశీలించారు. తెలంగాణ యాపిల్‌గా ప్రసిద్ధి చెందుతున్న ఈ పంట సాగు మంచి ఫలితాలనివ్వాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సూచిస్తున్న లాభసాటి వ్యవసాయ విధానంలో పంటలు వేయాలని సూచించారు. ఈ యాపిల్ తోట రాష్ట్రానికే గర్వకారణమని, లింబారెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. హిమచల్‌ప్రదేశ్‌కు చెందిన హరిమన్ అనే రైతు తయారు చేసిన హరిమన్-99 సీడ్‌ను ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు పండిస్తున్నాడని తెలిపారు. ఆయనకు మంచి దిగుబడి వస్తోందని, లింబారెడ్డి కూడా ఒక సంవత్సరంలో మంచి దిగుబడి సాధిస్తాడని అన్నారు.