రోడ్డు భద్రతా చర్యలపై సీఎస్ సమావేశం
ABN , First Publish Date - 2020-12-11T23:13:58+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్‌కుమార్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్‌కుమార్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలుతగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ హదారులు, ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్, జీహెచ్‌ఎంసి తదితర ఇంజనీరింగ్ విభాగాలు వచ్చే నెల 15వ తేదీలోగా ప్రమాదాల నివారణకు సంబంధించి అవసరమైన తాత్కాలిక చర్యలను పూర్తిచేయాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డేటా సేకరణను మరింత పటిష్టంగా సేకరించడానికి జియో కో ఆర్డినేట్‌తో, ఫోటో గ్రాఫ్‌లతో డేటాను క్యాప్చర్ చేయడానికి అవసరమైన యాప్‌ను అభివృద్ది చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సరియైున పైనేజీ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్‌ఆర్‌కు సంబంధించి ఆటోమేటెడ్ పద్దతితో కూడిన (స్పీడ్ గన్స్ కెమెరాలు) ప్రత్యేక సెక్యూరిటీ సేఫ్టీ ప్లాన్‌ను రూపొందించి అవసరమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను చేపట్టాలన్నారు.
ట్రామా కేసులకు తక్షణ వైద్య సహాయం అందించేలా యూనిఫైడ్ అంబులెన్స్ నెట్‌వర్క్, ట్రామా సెంటర్, అవసరమైన ఆస్పత్రుల లాంటి అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సమర్పించడానికి అవసరమైన నివేదికను వారంలోగా తయారు చేయాలని కోరారు. ప్రమాదాల బాఽధితుల ప్రాణాల రక్షణ కోసం ఈఎంఆర్‌ఐ ద్వారా వాలంటీర్లకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ శిక్షణ పెద్ద ఎత్తున చేపట్టి విస్తృతమైన మార్పును తీసుకు రావాలన్నారు.
ప్రభుత్వ డ్రైవర్స్ , ఇన్‌స్టిట్యూషన్ డ్రైవర్లకు రహదారి భద్రత చర్యలపై మరింత అవగాహన కల్పించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, అడిషనల్ డీజీపీ జితేందర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి సందీకుమార్‌సుల్తానియా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వాటర్‌బోర్డు ఎండి దాన కిషోర్, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావు తదితరులు పాల్గొన్నారు.