శాఖల పనులకు సీజనల్‌ క్యాలెండర్‌ రూపొందించుకోవాలి- సీఎస్‌

ABN , First Publish Date - 2020-06-04T22:47:39+05:30 IST

వివిధశాఖల ద్వారా అభివృద్ది పనులు చేపట్టడం కోసం సీజనల్‌ క్యాలెండర్‌ను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

శాఖల పనులకు సీజనల్‌ క్యాలెండర్‌ రూపొందించుకోవాలి- సీఎస్‌

హైదరాబాద్‌: వివిధశాఖల ద్వారా అభివృద్ది పనులు చేపట్టడం కోసం సీజనల్‌ క్యాలెండర్‌ను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన అన్నారు. గురువారం వివిధ శాఖల పనుల కన్వర్జెన్స్‌ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. 


వివిధ శాఖల్లో చేపట్టిన పనుల గుర్తింపుతో పాటు ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా పనులు చేపట్టడానికి సీజనల్‌ క్యాలెండర్‌ను రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు అధిక నిధులు పొందేలా గ్రామాల్లో పెద్దయెత్తున ఉపాధి హామీ పనులు చేపట్టి గ్రామీణ యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని సీఎస్‌ తెలిపారు. ఉపాధి హామీ , వివిధ శాఖలకు కేటాయించిన నిధులతో ప్రభుత్వ ప్రాధాన్య పనులైన వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, రైతువేదికలు, కలములు, గ్రామీణ పార్కులు, గొర్రె, పశువుల షెడ్ల నిర్మాణాల పనులతో పాటు ఫీడర్‌ ఛానళ్లు, ఇరిగేషన్‌ డిస్ర్టిబ్యూటరీల డీసెల్టింగ్‌, మౌసింగ్‌కాలనీలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులు చేపట్టడం పై దృష్టిసారించాలన్నారు.


 ఉపాధిహామీ పనుల్లో వివిధ శాఖలు యాక్టివ్‌ రోల్‌ పోషించాలన్నారు. వివిధ పనులకు సంబంధించి స్టాండర్డ్‌ డిజైన్స్‌, ఎస్టిమేషన్స్‌ రూపొందించాలని గ్రామ, మండల, జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి సుదీప్‌కుమార్‌ సుల్తానియా, సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T22:47:39+05:30 IST