మిడతలను ఎదుర్కోడానికి సిద్ధం కండి: సీఎస్
ABN , First Publish Date - 2020-06-18T09:41:08+05:30 IST
మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మిడతలు దాడి చేసే ప్రమాదమున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అగ్నిమాపక, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న గ్రామాల కోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికను తయారు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి మిడతల ఆపరేషన్‌లో భాగస్వాములు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫసర్‌ను నియమించాలని, జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన స్ర్పేయర్లు, సేఫ్టీ కిట్స్, మెటీరియల్, నీటి వసతి, లైటింగ్ తదితరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిడతల గమనం, నిరోధక చర్యలపై శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు.