ధరణి పోర్టల్‌లో ఆధార్ నమోదు చేస్తే..: సోమేష్
ABN , First Publish Date - 2020-10-27T21:08:55+05:30 IST
ఈ నెల 29న సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభిస్తారని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కేసీఆర్ ఆలోచనల మేరకు ధరణి పోర్టల్ రూపకల్పన జరిగిందని చెప్పారు. తాసీల్దార్ సెలవులో ఉంటే నయాబ్ తాసిల్దార్ పని చేయాలన్నారు. ధరణి పోర్టల్

మేడ్చల్: ఈ నెల 29న సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభిస్తారని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కేసీఆర్ ఆలోచనల మేరకు ధరణి పోర్టల్ రూపకల్పన జరిగిందని చెప్పారు. తాసీల్దార్ సెలవులో ఉంటే నయాబ్ తాసిల్దార్ పని చేయాలన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తే రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ వెంటనే జరిగిపోతాయని వెల్లడించారు. ఎవరి పేరుపై భూమి ఉంటుందో వారి ఆధార్ ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. మోసం చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి, వక్ఫ్, దేవాలయ భూములను ఆటోలాక్‌లో పెట్టినట్లు సీఎస్ సోమేష్‌కుమార్ వివరించారు.
