బాబోయ్‌.. మొసలి

ABN , First Publish Date - 2020-07-22T09:23:00+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామ ఊర చెరువు గట్టుపై ఉన్న పచ్చిక బయళ్లపై సేదతీరుతున్న

బాబోయ్‌.. మొసలి

ముప్కాల్‌, జూలై 21: నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామ ఊర చెరువు గట్టుపై ఉన్న పచ్చిక బయళ్లపై సేదతీరుతున్న మొసలి ఒకటి అటుగా వెళ్తున్న గ్రామస్థులకు కనిపించింది. ఈ విషయం తెలియడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మొసలి సంచరిస్తున్న విషయాన్ని అటవీ అధికారులకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. అటవీ అధికారి వచ్చి చెరువు పరిసరాలను పరిశీలించారు. అప్పటికే నీటిలోకి మొసలి జారుకుంది. వర్షాకాలం కావడంతో గుడ్లు పెట్టేందుకు మొసలి వచ్చి ఉండవచ్చని ఆ అధికారి అంచనా వేశారు. మళ్లీ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. త్వరలోనే దానిని పట్టుకుంటామని ధైర్యం చెప్పారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2020-07-22T09:23:00+05:30 IST