అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు- తలసాని
ABN , First Publish Date - 2020-03-23T22:18:23+05:30 IST
నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాపారులను హెచ్చరించారు.

హైదరాబాద్: నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాపారులను హెచ్చరించారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించిందన్నారు. ప్రస్తుత పరిస్థితులను అదును చేసుకుని వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి , ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ ఉన్న నేపధ్యంలో ఎవరైనా వ్యాపారులు అధిక ధరలకు విక్రయాలు జరిపితే నిత్యావసర వస్తువుల చట్టం, ఇతర చట్టాలకింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా ఎమ్మార్పీకి మించి నిత్యావసరాలను విక్రయిస్తే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఇండ్లలోనే ఉండి కరోనా నిర్మూలనకు సహకరించాలన్నారు.