గ్రేటర్లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్లు వీరే..
ABN , First Publish Date - 2020-12-05T22:29:01+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో నేరచరిత్ర...

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేసింది. మూడు పార్టీల్లో మొత్తం 25 మంది నేరచరితులు ఉన్నట్లు పేర్కొంది. బీజేపీ 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎంలో ఏడుగురు కార్పొరేటర్లు నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ప్రకటించింది.