శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన ఘనత
ABN , First Publish Date - 2020-10-28T01:12:16+05:30 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని తీసుకువచ్చిన తొలి ఎయిర్‌పోర్టుగా ఆర్‌జీఐఏ గుర్తింపు లభించింది. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో అంతర్గతంగా ఈ-బోర్డింగ్‌కు రూపకల్పన

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని తీసుకువచ్చిన తొలి ఎయిర్‌పోర్టుగా ఆర్‌జీఐఏ గుర్తింపు లభించింది. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో అంతర్గతంగా ఈ-బోర్డింగ్‌కు రూపకల్పన చేయబడింది. ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన మొదటి ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో గుర్తింపు పొందింది. ఈ-బోర్డింగ్ సేవల ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత భద్రత లభించనున్నట్లు ఆర్‌జీఐఏ తెలిపింది.